అఖిల్ సినిమా టైటిల్ ఇదేనా..?

Submitted by editor on Mon, 02/03/2020 - 06:23
Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

అక్కినేని అఖిల్.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో. అఖిల్ సినిమా హిట్  కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ తాజా చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రం ఇది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. రేపు సాయంత్రం 5 గంటలకు చిత్ర యూనిట్ టైటిల్ ను రివీల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను చిత్ర యూనిట్ భావిస్తోంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ, దాదాపు ఇదే టైటిల్ ఖరారు చేయవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.