గ్రామ వాలంటీర్లకు.. ప‌వ‌న్ ఉచిత స‌ల‌హాలు..!

pawan kalyan  free suggestions for village volunteers 

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రామ వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయ‌ని.. ప్రతి ఇంటికీ రేషన్‌ను గ్రామ వాలంటీర్లే అందిస్తార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో.. వాలంటీర్లు ఏం చేస్తున్నారని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్రశ్నించారు.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ స‌క్ర‌మంగా ప‌ని చేయ‌క‌పోవ‌డం కార‌ణంగా.. నిత్యావసర వస్తువులు, రేషన్ కోసం గుంపులుగా దుకాణాల వద్దకు చేరుకుంటున్నారని, ఈ క్ర‌మంలో రేషన్ షాపుల ముందు క్యూలు కనపడుతున్నాయ‌ని ప‌వ‌న్ అన్నారు. లాక్‌డౌన్ విజయవంతం కావాలంటే గ్రామ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ సక్రమంగా పనిచేయాలని, వాలంటీర్లు మరింత బాధ్యతతో పనిచేయాలని పవన్ కల్యాణ్  వ్యాఖ్య‌లు చేశారు.