తెలంగాణ‌లో క‌రోనా పాజ‌టివ్.. లేటెస్ట్ నెంబ‌ర్స్ ఇవే..!

corona positive cases in telangana

తెలంగాణలో కరోనా వైర‌స్ బాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం మ‌రో ముగ్గురికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70కి చేరుకుంది. అయితే మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ వ‌చ్చి, చికిత్స తీసుకుంటున్న వారిలో 11 మంది కోలుకున్నార‌ని, సోమ‌వారం వారిని డిశ్చార్జ్ చేయ‌నున్నార‌ని కేసీఆర్ తెలిపారు. అలాగే వైద్యఆరోగ్య‌శాఖ తెలిపిన సమాచారం ప్ర‌కారం, క‌రోనా పాజిటివ్ వ‌చ్చి చికిత్స తీసుకుంటున్న‌ అందరూ కోలుకునే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్ప‌టి నుండి కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదా కాక‌పోతే.. ఏప్రిల్ 7వ తేదీ నాటికి తెలంగాణ‌లో ఒక్క క‌రోనా కేసు కూడా ఉండ‌ద‌ని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌తిరోజు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్న నేప‌ధ్యంలో, కేసీఆర్ అంచ‌నా నిజ‌మైతే అంత‌కాన్నా ఆనందం ఇంకేముంటుంద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.