ఫైన‌ల్ వార్నింగ్ : 3 కిలో మీట‌ర్లు దాటితే.. స‌ర‌దా తీరిపోతుంది..! 

dgp mahender reddy to telangana motorists

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించింన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌ధ్య‌లో ప్ర‌తి ఒక్క‌రు సామాజిక దూరం పాటించాల‌ని, ఇళ్ళ‌కే ప‌రిమితం అవ్వాల‌ని, నిత్య‌వ‌స‌ర‌, అత్య‌వ‌స‌ర వ‌స్తువుల కోసం త‌ప్పా ఎవ‌రూ ఇంటి నుండి క‌ద‌లొద్ద‌ని ప్ర‌భుత్వాలు, అధికారులు నెత్తి నోరూ కొట్టుకుంటున్నారు. అయితే కొంద‌రు మాత్రం దీనిని లైట్‌గా తీసుకుని.. బైకులు, కార్లు వేసుకొని రోడ్లు ఎక్కుతున్నారు. ప్ర‌భుత్వాల విజ్ఞ‌ఫ్తి, అధికారుల హెచ్చ‌రిక‌లు, పోలీసుల లాఠీ దెబ్బ‌లు, ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కొంద‌రిలో మార్పు క‌నిపించ‌డంలేదు. దీంతో వాహ‌న దారులు ఎవ‌రైన త‌మ ప‌రిది నుండి 3 కిలో మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం ప్ర‌యాణిస్తే.. భారీగా జ‌రిమానా విధిస్తామ‌ని తెలంగాణ డీజీపీ సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చారు. వాహ‌న‌దారుల‌కు ఇదే ఫైన‌ల్ వార్నింగ్ అని డీజీపీ తేల్చి చెప్పారు.