అంద‌రూ ఆరోగ్యంగా ఉండాలి : తెలుగులో ప్ర‌ధాని మోడీ ట్వీట్ 

అంద‌రూ ఆరోగ్యంగా ఉండాలి : తెలుగులో ప్ర‌ధాని మోడీ ట్వీట్ 

 ఇవాళ‌ నూతన సంవత్సరాది పర్వదినం 'ఉగాది' తెలుగు రాష్ట్రాల్లో నిరాడంబరంగా జరుగుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్ర‌ధాని మోడీ తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. "ఉగాదితో  కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు. అదేలా వివిధ భాషల్లో ప్రజలకు ట్విట్టర్ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.