రాజధాని రైతులకు వైసీపీ ఎంపీ మద్దత్తు

YCP MP Supports AP Capital Farmers

రాజధాని రైతుల ఉద్యమానికి నరసారావు పేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మద్దతు తెలిపారు. మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు ఆయన మద్దత్తు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పాలని రైతులకు సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆందోళన చేస్తున్న రైతులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. తర తరాల నుంచి వచ్చిన ఆస్తులపై రైతులకు భావోద్వేగం ఉంటుంది. రైతుల ఆందోళనను అర్థం చేసుకోగలం. రైతులకు న్యాయం జరిగే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావాలని ఆశిద్దాం. రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ’’ అని ఎంపీ వివరించారు.