గోడ కూలి ఇద్దరు మృతి

TWO PEOPLE ARE DIED BY WALL FALLEN

మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని చెరువు కట్ట సమీపంలోని హనుమాన్ దేవాలయం గోడ కూలడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిపై రాళ్ళు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతుల వివరాలను సేకరిస్తున్నారు.