కాల్వ‌లోకి దూకి ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య 

కాల్వ‌లోకి దూకి ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య 

కాల్వ‌లోకి దూకి ఇద్ద‌రు ఆత్మహ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ముద్ద‌నూరులో గ‌ల కాల్వ‌లో దూకి వారు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారు కార్తీక్, క‌విత‌గా గుర్తించారు. కార్తీక్ మ‌ర్రికొమ్మ‌దిన్నె వీఆర్ఏ గా ప‌నిచేస్తుండ‌గా, వివాహిత క‌విత మ‌ర్రికొమ్మ‌దిన్నెలో వాలంటీర్ గా ప‌నిచేస్తోంది. కొంత‌కాలంగా కార్తీక్ వివాహిత క‌విత‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలి కార్తీక్ కు ఇంట్లో ఒత్తిడి పెరిగింది. అయితే వేరే పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేక కార్తీక్ క‌విత‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.