భార‌త్ లో అర‌కోటి దాటిన క‌రోనా కేసులు 

భార‌త్ లో అర‌కోటి దాటిన క‌రోనా కేసులు 

భార‌త్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా భార‌త్ లో గ‌డిచిన 24 గంట‌ల్లో 90,123 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 50,20,360కి చేరుకుంది. అలాగే క‌రోనాతో గ‌త 24 గంట‌ల్లో 1209మంది మృతిచెందారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 82,066కు చేరుకుంది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వర‌కు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొంది 39,42,360 మంది డిశ్చార్జ్ కాగా, దేశ‌వ్యాప్తంగా 9,95,933 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ న‌మోదైన క‌రోనా కేసుల‌తో క‌లిపి భార‌త్ లో మొత్తం క‌రోనా కేసులు అర‌కో‌టి దాటాయి.