భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ప‌సిడి ప్రేమికుల‌కు ఒక్క‌సారిగా ధ‌ర‌లు షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్క‌సారిగా అమాంతంగా పెరిగిపోయాయి. పెరిగిన బంగారం ధరలతో పసిడి ప్రియులు ఖంగుతిన్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర కూడా భారీగానే పెరిగింది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.490 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,020కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.450 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,520 అయింది.
 ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. తాజాగా రూ.490 మేర భారీగా ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,030 చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.450 పెరగడంతో ధర రూ.50,450కి పుంజుకుంది. బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. తాజాగా రూ.1200 మేర భారీగా ధర పెరగడంతో.. 1 కేజీ వెండి ధర రూ.69,500 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది.