త్వరలో కీర్తీ సురేష్ మొదటి సినిమా

KIRTI SURESH FIRST MOVIE WILL RELEASE

నందిని నర్సింగ్ హోమ్‌ ఫేమ్‌ నవీన్ విజయ్ కృష్ణ హీరోగా 'ఐనా ఇష్టం నువ్వు' అనే మూవీకి కీర్తి ఒప్పుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. అంతేకాదు దీనికి సంబంధించిన టీజర్లు కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇక కారణాలు తెలీవు గానీ ఆ సినిమా అప్పట్లో ఆగిపోయింది. ఆ తరువాత కీర్తి, నేను శైలజలో నటించగా.. ఆ మూవీనే కీర్తి మొదటి చిత్రంగా అందరికీ గుర్తుండిపోయింది. ఇక నేను లోకల్, మహానటి ఇలా వరుస సక్సెస్‌లతో కీర్తి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాను పూర్తి చేసేందుకు కీర్తి ఓకే చెప్పిందట. ఈ విషయాన్ని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేసేందుకు కీర్తి ఒప్పుకుందని, ఈ మూవీని అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల చేస్తామని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్‌ చేతినిండా చిత్రాలు ఉన్నాయి. రజనీకాంత్, మహేష్ బాబు ఇలా పలువురి స్టార్ హీరోల సినిమాల్లో ఆమె నటిస్తోంది. అంతేకాదు ఆమెకంటూ ఒక బ్రాండ్ ఉంది. అయినా అవన్నీ పట్టించుకోకుండా దర్శకనిర్మాతల గురించి ఆలోచించి, ఆగిపోయిన ఆ సినిమాను పూర్తి చేసేందుకు కీర్తి ఒప్పుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమే. కాగా ఈ సినిమాకు రామ్ ప్రసాద్ రౌత్ దర్శకత్వం వహించారు.