రాష్ట్రంలో 60,95,134 మంది ప‌ట్టాదారులు : కేసీఆర్ 

రాష్ట్రంలో 60,95,134 మంది ప‌ట్టాదారులు : కేసీఆర్ 

రాష్ర్టంలో మొత్తం 60,95,134 మంది పట్టాదారులు ఉన్నారని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు 39,52,232 మంది ఉన్నారని తెలిపారు. 2.5 నుంచి 3 ఎకరాల్లోపు ఉన్న రైతులు 4,70,759 మంది, 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11,08,193 మంది, 5 నుంచి 7.5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 3,49,382 మంది, 7.5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 1,15,916 మంది, 25 వేల ఎకరాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు బయట అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఈ బిల్లు వల్ల భూస్వాములకు లాభం జరుగుతుందని అంటున్నారు. కానీ తెలంగాణలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు లేరని సీఎం తేల్చిచెప్పారు.