కరోనాతో కామెడీలొద్దు

DONT PLAY GAMES WITH CORONA

భారతదేశమంతా లాక్ డౌన్ లో ఉన్న సంగతి విదితమే. ఈ లాక్ డౌన్ పై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దాదాపుగా అందరూ అర్ధం చేసుకుని సహకరిస్తున్నా, కొందరు మాత్రం అర్థరహిత వాదనలు వినిపిస్తున్నారు.
ఇన్నిన్ని రోజులు ఇంట్లో ఉంటె తమ పనులెలా పూర్తవుతాయని తెగ బాధ పడిపోతున్నారు. మరికొందరు అజ్ఞానులు ఈ పరిస్థితి మీద జోకులేస్తూ, పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు, వీటి వలన కరోనా మీద అవగాహన లేని వారు భయపడడం లేదా పెడద్రోవ  పట్టడం లాంటి అవకాశాలు ఉన్నాయి. జరుగుతున్నది ఆనందించే విషయమో, అవహేళన చేసే విషయమో కాదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది, భయపడే వారికి ధైర్యం చెప్పాలి. వారికి కరోనా వైరస్ మీద అవగాహన కల్పించాలి. అంతే గానీ ఇంట్లో ఖాళీ గా ఉండేందుకు సమయం దొరికింది కదా అని, కరోనాతో కామెడీలు  చెయ్యొద్దని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.