కండల వీరుడికి కరోనా

WWE ROCK AFFECTED BY CORONA

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తోంది. వారు వీరు అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. తాజాగా WWE సూపర్ స్టార్ ది రాక్ అలాగే అతని కుటుంబ సభ్యులు 'భార్య లారెన్ మరియు వారి కుమార్తెలు జాస్మిన్, టియానా'కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ తెలిపాడు. అందులో... మూడు వారాల క్రితంనాకు, నా భార్య అలాగే ఇద్దరు పిల్లలకు కరోనా సోకింది. అయితే ఈ సమయం మా అందరికి ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు మా జీవితంలోనే ఎప్పుడు ఇటువంటి ఛాలెంజ్ ను ఎదుర్కోలేదు. అయితే ఇప్పుడు ఈ వైరస్ తో పోరాడటం మరింత వ్యక్తిగతమైంది , ఎందుకంటే పాజిటివ్‌ వచ్చింది నాకు మాత్రమే అని నేను అనుకున్నాను, కానీ ఇది నా కుటుంబం మొత్తానికి వచ్చింది.
కాబట్టి ఎల్లప్పుడూ నా కుటుంబాన్ని రక్షించడం, నా పిల్లలను, నా ప్రియమైన వారిని రక్షించడం నా బాధ్యత" అని రాక్ వివరించారు. అయితే ఇప్పుడు ఆ వైరస్ ని జయించి మేము అందరం బయటపడ్డాము అని చెప్పారు. ఈ కారణంగా తనకు ఆరోగ్యం మీద మరింత జాగ్రత్త వచ్చిందన్నారు.