ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం 

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం 

ఇవాళ తెల్లవారుజామున ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం ట్విట్టర్‌లో పేర్కొంది. ఫిలిప్పీన్స్‌కు 12.07 అక్షాంశ, 124.25 రేఖాంశాలకు 10 కిలోమీటర్ల లోతులో మనీలాకు 451 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపం సంభవించిందని తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. సునామీ ముప్పు సంభవించే ప్రమాదం ఉందంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంప నల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 8:03 నిమిషాలకు భూకంపం సంభవించి నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మనీలాకు 451 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది.