తెలంగాణ‌లో మ‌రో 1256 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో మ‌రో 1256 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సోమవారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 389 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కు చేరింది. ఇక కరోనా భారిన పడి మరో 1,587 మంది. సంపూర్ణంగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 57,586 కు చేరింది. ఇక కరోనాతో కొత్తగా మరో 10 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 637కు పెరిగింది. నిన్న ఒక్క రోజు 11,609 నమూనాలను పరిశీలించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 6,24,840 నమూనాలు పరీక్షించినట్లు వివరించింది. ఇంకా 1,700 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.