క్రేన్ విరిగిప‌డి న‌లుగురు మృతి

క్రేన్ విరిగిప‌డి న‌లుగురు మృతి

క్రేన్ విరిగిప‌డి న‌లుగురు మృతిచెంద‌గా, ప‌లువురికి గాయాలైన విషాధ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. క్రేన్ విరిగిపడిన ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరికొంత మందికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని స్థానికులు అంటున్నారు.  ప్ర‌మాద స‌మ‌యంలో ఘ‌ట‌నా స్థ‌లంలో 40మందికి పైగా కార్మికులు, సిబ్బంది ఉన్న‌ట్లు స‌మాచారం. గాయ‌ప‌డిన వారిలో కొంత మంది ప‌రిస్థితి విష‌యంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.