విజయ్ దేవరకొండకి పూరి వార్నింగ్

puri warns to vijay

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా కరణ్ జోహార్ నిర్మాతగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

ఫైటర్ అనే టైటిల్ తో ఈ సినిమా వస్తోంది. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది మొదట్లో గానీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో పూరి జగన్నాథ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని సమాచారం. కథలో చాలా వరకు మార్పులు చేయాలి అంటూ పూరి జగన్నాథ్ ని విజయ్ దేవరకొండ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో కథను మార్చాలి అంటూ పూరి జగన్నాథ్ పై తీవ్రంగా విజయ్ దేవరకొండ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

దీనిపై ఇప్పుడు పూరి తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడట. తనకు కథ ఎలా ఉందో ఎలా ఉండాలో స్పష్టమైన అవగాహన ఉందని తనకు కొత్తగా ఏమీ నేర్పవద్దనీ స్పష్టంగా చెప్పాడట. అయితే సినిమాలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉండాలి అంటూ విజయ్ దేవరకొండ నుంచి పై ఒత్తిడి వస్తుందట. తనను యూత్ ఆదరించింది రొమాంటిక్ సీన్లు విషయంలో అని, ఖచ్చితంగా ఆ సీన్లు ఉండాలి అంటూ పూరి పై విజయ్ కాస్త ఘాటుగా చెప్పటంతో అవసరం అయితే తాను సినిమా నుంచి తప్పుకుంటానని తనకు కథ విషయంలో ఎలాంటి సలహాలు ఇవ్వద్దు అని మొహం మీద చెప్పేశాడట.