ఆత్మాహుతి దాడిలో 9మంది మృతి

ఆత్మాహుతి దాడిలో 9మంది మృతి

అఫ్గానిస్థాన్​లో ఆత్మాహుతి దాడి జ‌రిగింది. తూర్పు లోగర్​ రాష్ట్రంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు, ముగ్గురు స్థానికులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రాష్ట్ర రాజధాని పుల్​ ఈ అలామ్​లోని పోలీసు తనిఖీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది పౌరులు ఉన్నట్లు చెప్పారు. వారిలో పోలీసు తనిఖీ కేంద్రం వద్ద నిలిచి ఉన్న కార్లలోని వారే అధికంగా ఉన్నట్లు తెలిపారు. జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్తాన్‌ రాకెట్‌ దాడులు చేసింది అని ఆఫ్ఘాన్‌ ఆరోపించింది. పాకిస్తాన్ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేశంలోని అన్ని సైనిక దళాలు, ముఖ్యంగా 205 అటల్, 201 సలాబ్, 203 థండర్ క్యాంపులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ సాయుధ దళాల అధిపతి జనరల్ మహ్మద్ యాసిన్ జియా లెవి చెప్పారు. పాకిస్తాన్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆఫ్ఘన్ దళాలు సిద్ధంగా ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.