భార‌త్ లో కొత్త‌గా 55,079 క‌రోనా కేసులు 

భార‌త్ లో కొత్త‌గా 55,079 క‌రోనా కేసులు 

భారత్‌లో కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం చూపిస్తోంది. దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. మొన్న‌టి వ‌ర‌కు రోజుకు 40వేల‌కు పైగా న‌మోదవుతున్న కేసులు తాజాగా ఆ సంఖ్య 50వేల‌కు దాటిపోయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో  55,079 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 779 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 16,38,871కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 35,747కి పెరిగింది. 5,45,318  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,57,806 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య‌లో విప‌రీతంగా పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌నల‌కు గుర‌వుతున్నారు.