భారత్‌లో మ‌రోసారి రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు 

భారత్‌లో మ‌రోసారి రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు 

భారత్‌లో కరోనా కేసుల ఉధృతి కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజూ 40వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదవుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ మ‌రోసారి రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా... గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలోనే 775 మంది చనిపోయారు. దీంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు పెరిగింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. క‌రోనాకు ఇప్ప‌టి వ‌ర‌కు మందు రాక‌పోవ‌డం.. క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.