ఫ్రాన్స్ నుంచి భారత్‌కు యుద్ధవిమానాలు

 ఫ్రాన్స్ నుంచి భారత్‌కు యుద్ధవిమానాలు

2016లో జరిగిన ఒప్పందం ప్రకారం మొత్తం 36 యుద్ద విమానాలు కొనుగోలు చేశారు. ఇప్పటికే ఒక విమానం దేశానికి చేరుకోగా.. ఇప్పుడు మరో ఐదు రాఫెల్ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి భార‌త్ కు రానున్నాయి. సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఈ యుద్ధ విమానాలు బుధవారం దేశానికి రానున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరే లోపు యూఏఈలో ఇందనం కోసం ఆగుతాయి. ఇప్పుడు ఐదు విమానాలు భారత్‌కు రానున్నాయి. అందులో రెండు ట్రైనర్, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన 12 మంది ఫైలట్లు ఫ్రాన్స్‌లో శిక్షణ పొందారు. మొత్తం 36 మంది ఫైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.