పిల్లిని ఉతికేసిన మహిళ

cat in washing machine

ఆస్ట్రేలియాలోని ముద్జింబా ప్రాంతంలో అమందా మెరేదిత్ అనే మహిళ తన ఇంట్లో ఓ పిల్లిని పెంచుకుంటోంది. దానికి ఆస్కార్ అనే పేరు పెట్టుకుంది. ఓ రోజు అమందా తన బెడ్‌షీట్లను ఉతికేందుకు వాషింగ్ మిషన్లో వేసింది. వాటిని వాషింగ్ మెషీన్‌లో వేసి వేరే పని చేసుకుంటోంది. ఇంతలో ఎక్కడి నుంచో తన పిల్లి ఆస్కార్ అరుపులు వినిపించాయి. దీంతో ఇళ్లంతా వెతికినా తన ప్రియమైన పిల్లి జాడ తెలియలేదు. అనుమానం వచ్చి వాషింగ్ మెషీన్ వైపు చూసిన అమందా షాకైంది.
ఆ పిల్లి కాళ్లు వాషింగ్ మెషీన్ అద్దం నుంచి కనిపించాయి. అప్పటికే ఆ పిల్లి అందులోని బెడ్‌షీట్స్‌తోపాటు తిరుగుతోంది. వాషింగ్ మెషీన్ ఆన్ చేసి అప్పటికే దాదాపు 10 నిమిషాలైంది. వెంటనే అమందా వాషింగ్ మెషిన్‌ను ఆపేసింది.

ఆ పిల్లిని బయటకు తీసింది. వేడి నీళ్లు, డిటర్జెంట్ నీళ్లలో మునిగినా అది బతికే ఉండటంతో ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని అమందా సోషల్ మీడియాలో వెల్లడించింది. పది నిమిషాల పాటు వాషింగ్ మిషన్లో ఉన్న పిల్లి బతకడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు.