ప‌రీక్ష‌ల‌కు ప‌చ్చ‌జెండా 

ప‌రీక్ష‌ల‌కు ప‌చ్చ‌జెండా 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ‌ ఉన్నత విద్యా సంస్థల పరీక్షల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. కరోనా విజృంభణ కారణంతో పలు రాష్ట్రాలు యూజీ, పీజీ పరీక్షలను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో.. కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డం  చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల కారణంగా చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తారనే ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే యూనివర్సిటీ అఫ్ గ్రాంట్ కమిషన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, 2020 ఏప్రిల్ 29 న పరీక్షలపై జారీ చేసిన మార్గదర్శకాలలో మార్పులు ఉండవని వర్గాలు తెలిపాయి. ఫైనల్ టెర్మ్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా నిర్వహించాలని.. ఇందులో యూజీసీ మార్గదర్శకాలకు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు లోబడి, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర హోం శాఖ సూచించింది.