15 ఏళ్లు గడిచిన అతడే టాప్

athadu is top place in satellite

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2005లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అతడు. ఆకట్టుకునే కథ, కథనాలతో ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.

మహేష్ బాబు అందం, ఆకట్టుకునే అభినయంతో పాటు, హీరోయిన్ త్రిష అందచందాలు, మణిశర్మ అందించిన వండర్ఫుల్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్, ఫైటింగ్ సీన్స్ వంటివి ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలు.
అప్పట్లో ఈ సినిమా విజయం తరువాత దీని శాటిలైట్ హక్కులను మాటివి వారు అత్యధిక ధర చెల్లించి దక్కించుకోవడం జరిగింది. కాగా ఈ సినిమా ఇప్పటికీ నెలకు మూడు నాలుగు సార్లు మాటివి లో ప్రదర్శింపబడుతూనే ఉంది. ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమా రైట్స్ ని ఎప్పటికప్పుడు పోటీ పడి మరీ మాటివి వారే దక్కించుకుంటూ ఉండడంతో పాటు ప్రదర్శిస్తూ వస్తున్నారు.
అత్యధిక సార్లు శాటిలైట్ ఛానల్ లో ప్రదర్షింపబడిన ఏకైక సినిమాగా అతడు ఇటీవల ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకుంది. ఏళ్ళు గడిచినప్పటికీ కూడా పలు ఛానల్స్ ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడం కోసం ఇంకా ఎగబడుతూనే ఉంటాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా యొక్క క్రేజ్ ఎటువంటిదో. ఇప్పటి రోజుల్లో కూడా టివిలో ప్రదర్శితమయిన ప్రతిసారీ మీడియం రేంజ్ రేటింగ్స్ సాధించే అతడు సినిమా ఈ విధంగా అటు మహేష్, ఇటు త్రివిక్రమ్ ల కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమాగా చెప్పవచ్చు....!!