త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో లక్ష్మీ బాంబ్ విడుదల

laxmibomb release in hotstar

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రచయిత అయిన రాఘవ లారెన్స్ కాంచన సిరీస్ సినిమా లు తీసి దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించాడు. ముఖ్యంగా ముని, కాంచన సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. 2011లో విడుదలైన కాంచన సినిమాని హిందీలో లక్ష్మీ బాంబ్ అనే పేరుతో మళ్లీ రాఘవ లారెన్సే తెరకెక్కించనున్నాడు. ఐతే హిందీ అఫీషియల్ రీమేక్ లో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ కేవలం దర్శకత్వం, స్క్రీన్ ప్లే మాత్రమే అందిస్తున్నాడు.

కాగా అక్షయ్ కుమార్, తుస్సార్ ఖాన్, సబీనా ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రంజాన్ సందర్భంగా మే నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఆ ముహూర్తం వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో అన్ని హిందీ తమిళ తెలుగు సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదల అవుతున్నాయి. అయితే ఈ చిత్రం కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అతి త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ ప్లాట్ ఫాం లో విడుదల కానున్నదని తెలుస్తుంది.
ఇకపోతే లక్ష్మీ బాంబ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని గత ఏడాది అక్టోబర్ నెలలో చిత్రబృందం విడుదల చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్ పెద్ద ఎర్రటి బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని గాజులు వేసుకుని భయంకరంగా కనిపించాడు. భారీ తారాగణంతో భయపెట్టే సన్నివేశాలతో రూపొందిన లక్ష్మీ బాంబ్ సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. మరి అక్షయ్ కుమార్ దయ్యం పాత్రలో, దయ్యాలంటే భయం కలిగిన వ్యక్తి పాత్రలో ఎంత గొప్పగా నటించాడో చూడాలిక.