క‌రోనాతో బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా మృతి

క‌రోనాతో బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా మృతి

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ సీనియర్ కార్యదర్శి అబ్దుల్లా అల్‌ మోసీన్‌ చౌదరి (57) కరోనా వ్యాధితో మరణించారు. బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా తీవ్ర అనారోగ్యంతో ఢాకాలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ లో చేరారు. ఈయనకు జూన్ 6వతేదీన పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అబ్దుల్లా ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని జూన్ 18వతేదీన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు. కరోనాకు చికిత్స పొందుతూ ఇవాళ‌ ఉదయం అబ్దుల్లా మరణించారు.