ముగ్గురు ఉగ్రవాదులు హతం

ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కుల్చోహర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇవాళ‌ ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌చోహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. అయితే పోలీసులు, భద్రతా బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు.