కరోనా బలహీనపడుతుందంట

CORONA EFFECT WILL DIS CREASE IN FUTURE

కరోనా వైరస్ ని ఎలా అయినా అంతం చెయ్యాలి అని కొన్ని వందలకుపైగా సంస్దలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాయి. ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే వ్యాక్సిన్ వస్తే తప్ప కరోనా నుండి ప్రపంచం ఊపిరి పీల్చుకోలేదు అనేది మనందరి అభిప్రాయం.
కానీ ఓ ప్రొపెసర్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయ్. జెనోవా కు చెందిన ప్రొఫెసర్ బస్సెట్టి మాటియో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎంతో బలంగా ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు రోజు రోజుకు బలహీనపడుతూ వస్తుంది అని అన్నారు. ఈ సమయంలో 80 నుంచి 90 ఏళ్ల వృద్దులకు కరోనా వైరస్ సోకినా వారు కోలుకొంటున్నారని అయన చెప్పారు.
అయితే ఫిబ్రవరి, మర్చి నెల సమయంలో ఇదే వయసులో ఉన్న వృద్ధులు చనిపోయారని, ఇప్పుడు అలా లేదు అని.. ఇకపై అటువంటి మరణాలు ఉండవు అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. రోజు రోజుకు ఈ వైరస్ బలహీనపడుతుంది అని రాబోయేరోజుల్లో మరింత బలహీనపడి వ్యాక్సిన్ అవసరం లేకుండానే అంతం అవుతుందని ప్రొఫెసర్ బస్సెట్టి మాటియో తెలిపారు. ఏది ఏమైనా ఇది కూడా ఒక రకమైన గుడ్ న్యూస్ అనే చెప్పాలి.