ప్రాథమిక స్థాయి కరోనాకు ఇంటి వైద్యం

PRIMARY STAGE OF CORONA WILL CONTROL WITH TURMERIC AND SALT

ప్రపంచ మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరీక్షలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు కొందరు వైద్యులు ఇప్పటికే కరోనాను కట్టడి చేసేందుకు మందు కనుగొన్నారని చెపుతుండగా నిన్నటికి నిన్న నైజీరియా కరోనాకు మందు కనుగొందని వార్తలు వచ్చాయి. ఇక మన దేశంలో ప్రాచీన వైద్యాలను గుర్తు చేస్తోన్న కొందరు వాటిని వాడాలని సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ (టాంపా), అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్‌) అధ్యక్షుడు ప్రొ.డాక్టర్‌ సీఎంకే రెడ్డి అదిరిపోయే మన ఇంటి వైద్యం చెప్పారు.

వేడి నీటిలో ఉప్పు, పసుపు కలిపి రోజుకు ఐదుసార్లు పుక్కిళిస్తే ప్రాథమిక స్థాయిలోనే కరోనా వైరస్‌ మహమ్మారిని నివారించవచ్చని ఆయన ప్రజలకు సూచించారు.
తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో పాటు పరిసర జిల్లాలైన తిరువళ్లూర్‌, చెంగల్పట్టు, కాంచీపురం ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో, దాని భారీన పడకుండా ఉండేందుకు ఏం చేయాలనే జాగ్రత్తలను ఆయన సూచించారు.
అల్లం, వెల్లుల్లి, మిరియాలు, సొంఠి, జిలకర, ధనియాలు, లవంగాలు, ఆవాలు తదితర వాటిని ఎక్కువ మోతాదులో వినియోగిస్తే వైరస్‌ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేడి నీటిలో ఉప్పు, పసుపు కలిసి ఐదు సార్లు పుక్కిలించినట్టయితే ప్రాథమికస్థాయిలోనే నివారించవచ్చని రెడ్డి తెలిపారు. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి శరీరంలో ఎక్కువుగా ఉంటుందని ఆయన చెప్పారు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు ఈ చిట్కా పాటిస్తే వైరస్ కొంతవరకు కట్టడి అయినా హ్యాపీయే.