భార‌త్ లో మ‌రో 9,304 మందికి కరోనా నిర్ధారణ

భార‌త్ లో మ‌రో 9,304 మందికి కరోనా నిర్ధారణ

భారత్‌లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య అధికమవడంతో ఆందోళన మరింత తీవ్రమవుతోంది. ఇవాళ‌ కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,304 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే... అదే సమయంలో 260 మంది మరణించారు.      
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,16,919 కి చేరగా, మృతుల సంఖ్య 6,075 కి చేరుకుంది. 1,06,737   మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకున్నారు.