కరోనాను ఆపలేం.. మంత్రి ఈటెల సంచ‌ల‌నం..! 

minister etela rajender comments on corona

క‌రోనాను ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి లేదని, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
కరోనాను ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి లేదని ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని.. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా అసలు కథ ఇప్పుడే మొదలవుతుందని ఈటె‌ల రాజేంద‌ర్ అన్నారు. 

తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైంద‌న్నారు.  ప్రస్తుతం ఇతర దేశాల, రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నందున  పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేద‌న్నారు. మొదటి రెండు నెలలు లాక్‌డౌన్‌  విషయంలో సీరియస్‌గా వ్యవహరించాం కాబట్టే, క‌రోనా ఎక్కువ స్థాయిలో విస్తరించలేదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో  అప్రమత్తంగా ఉండాల‌ని, జూన్, జూలై నెలల్లో క‌రోనా ఎక్కువగా విస్తరించే ప్రమాదం ఉంద‌ని రాజేంద‌ర్ తెలిపారు.

ఇక కరోనా అదుపులోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేస్తే  వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హుజురాబాద్ నియోజక వర్గానికి తీసుకువ‌స్తాన‌న్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాల‌న్నారు. ఈ సంవత్సరం 71 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు పంట పండించార‌ని రాజేందర్ తెలిపారు. దేశంలో అందరికి తెలంగాణ రైతులు అన్నం పెడుతున్నార‌ని.. రాబోయే రోజుల్లో  తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నార‌ని ఈటెల రాజేంద‌ర్ పేర్కొన్నారు.