విశ్వక్, వివేక్ ల మధ్య చిచ్చు పెట్టిన ఎన్టీఆర్ పాట

WAR BETWEEN VISWAK AND VIVEK

ఎన్టీఆర్‌ బర్త్ డే రోజున విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు.అయితే ఆ పాటను ఫలక్‌నుమా దాస్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ రూపొందించగా.. ఆ పాటను ఆ సినిమాలో ఉపయోగించుకోవడానికి వీలు కలుగలేదు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆ ట్రాక్‌కు కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేశారు. అయితే ఆ పాటను తన అనుమతి లేకుండా ఎలా రిలీజ్ చేస్తారని దర్శకుడు వివేక్ సాగర్ ఇన్స్‌టాగ్రామ్‌లో సీరియస్ అయ్యారు.
వివేక్ సాగర్ స్పందిస్తూ.. ఆ పాటకు సంబంధించి అందులో చాలా మంది కష్టం ఉంది. చాలా మంది కష్ట ఫలితమే ఆ పాట. ఆ పాటను ఫలక్ నామా దాస్ కోసం చేశాం. అంతేగానీ.. ఏదో బర్త్ డే కోసం మాత్రం కాదు. ఆ పాటను నా అనుమతి లేకుండా రిలీజ్ చేసినందుకు  చాలా బాధపడ్డాను, మనస్తాపానికి గురయ్యాను అని అన్నారు.
వివేక్ సాగర్ చేసిన ఆరోపణలు, విమర్శలపై హీరో విశ్వక్ సేన్ ఘాటుగా స్పందిస్తూ.. ఎట్టీ పరిస్థితుల్లోనే ఆ పాట హక్కుల మాకు ఉన్నాయి. ఫలక్‌నామా దాస్ కోసం మేం చేయించుకొన్నాం. దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మా విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. ఆ పాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించం. ఈ పాటకు సంబంధించి వివేక్ క్రెడిట్ ఇచ్చాం. ఆయన అనుమతి లేకుండా చేయడం నా తప్పే. అందుకు క్షమాపణలు కూడా చెబుతున్నాను అని అన్నారు.