మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌.. టీడీపీ కీల‌క నిర్ణ‌యం..!

tdp mahanadu dates fix

కరోనా లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా, ఈ ఏడాది మహానాడును ఆన్ లైన్‌లోనే నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నెల 27, 28న మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేవలం ఆరు గంటల్లో కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

ఈ క్ర‌మంలో శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. మహానాడు నిర్వహణ, తీర్మానాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ ముఖ్యనేతలు జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జామ్ యాప్ ద్వారా మీడియా సమావేశాలు, పార్టీ అంతర్గత మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.