చరిత్రలో చిరస్మరణీయైన రోజు: విజయసాయిరెడ్డి

చరిత్రలో చిరస్మరణీయైన రోజు: విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు చిరస్మరణీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయసాయిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ పలు ట్వీట్లు చేశారు.
'తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత'అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.