వివాదాస్ప‌ద‌ ట్వీట్ పై.. నాగ‌బాబు వివ‌ర‌ణ‌..!

nagababu tweet on nathuram godse 

భార‌త జాతిపిత మహత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన ట్వీట్ దుమారం రేపుతున్న నేప‌ధ్యంలో, తాజాగా మ‌రోసారి మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు స్పందించారు. తాను చేసిన ట్వీట్.. జన‌సేన పార్టీకి కానీ, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా తన వ్యక్తిగతం అని నాగ‌బాబు తెలిపారు. 

ఇక‌ నాగబాబు పోస్ట్‌ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి నాగబాబు పై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో స్పందించిన నాగ‌బాబు.. అందరూ త‌న‌ని అర్థం చేసుకోవాల‌ని.. తాను నాథూరాం గురించి ఇచ్చిన ట్వీట్ లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేద‌న్నారు.

నాథూరాం గాడ్సే వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాన్నారు. త‌న‌కి మహాత్మ గాంధీ అంటే చాలా గౌరవ‌మ‌ని.. ఇప్పుడు త‌నపై విమ‌ర్శులు చేస్తున్న వారి క‌న్నా త‌న‌కు ఆయనంటే చాలా గౌరవం అని నాగ‌బాబు తెలిపారు. నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపటంతో ఆయన ఈ వివరణ ఇచ్చినట్లు కన్పిస్తోంది. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం నాగ‌బాబు పై నెగిటీవ్ కామెంట్స్ వ‌స్తూనే ఉన్నాయి.