నితిన్ కొత్త చిత్రం రంగ్ దే

NITIN NEW MOVIE RANG DE

భీష్మ సూపర్ హిట్ తో, జోరు మీదున్న నితిన్ వరసపెట్టి క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు.ఆ వరసలో భీష్మ చిత్ర నిర్మాతలతోనే తన తదుపరి చిత్రం కూడా చేస్తున్నాడు. ఆ చిత్రంలో  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నితిన్ జన్మదినం సందర్భంగా ఆ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు. అట్లూరి వెంకీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి రంగ్ దే అనే టైటిల్ ని ఖరారు చేశారు. రంగ్ దే కి పి సి శ్రీరామ్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్ సినిమాకి DSP సంగీతమివ్వడం ఇదే మొదటిసారి.