క‌రోనాతో వార్ : మోదీ స‌ర్కార్ వైఫ‌ల్యం.. ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌నం..!

prashant kishor fire on modi sarkar

ఇండియాలో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌నితీరు అస‌లేమాత్రం బాగ‌లేద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. ఒక‌వైపు భ‌యంక‌ర‌మైన వైర‌స్ త‌రుముకు వ‌స్తుంటే, కేంద్ర ప్ర‌భుత్వం అల‌స‌త్వం వ‌హిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక‌ లాక్‌డౌన్ విష‌యంలో అయితే కేంద్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, అందుకే రోజురోజుకీ దేశం క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌ని, ఇది ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే అని ప్ర‌శాంత్ కిషోర్ ద్వ‌జ‌మెత్తారు. ఇక వైర‌స్ నిర్ధార‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయ‌డంలో, చికిత్స‌కు స‌దుపాయం క‌ల్పించ‌డంలో మోదీజీ స‌ర్కార్‌ ప‌నితీరు అస్స‌లు బాగ‌లేద‌ని ప్ర‌శాంత్ కిషోర్ ఆరోపించారు. ప్ర‌తి 10 లక్ష‌ల‌మందిలో కేవ‌లం 10 మందికి మాత్రమే క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, భార‌త‌దేశానికి కావ‌ల్సింది ఇది కాద‌ని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు.