స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్బ్రాంతి

స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్బ్రాంతి

విజ‌య‌వాడ‌లోని స్వర్ణ ప్యాలస్ లో ఇవాళ తెల్ల‌వారుజామున భారీ అగ్ని ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆద్వర్యంలో హోటర్ స్వర్ణ పేలస్ లో పెయిడ్ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ముప్పై మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పది మంది ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారు. షార్ట్ సర్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 11మంది మరణించారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది భయంతో భవనంపై నుంచి దూకేసారు. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. 15మంది రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. 
ఈ అగ్నిప్ర‌మాదంపై తెలుగుదేశం అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల‌ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా సెంటర్ లో అగ్ని ప్రమాదం చాలా బాధకరమని అన్నారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండ‌గా ఈ అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు లు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.