కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి

కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజయవాడ స్వ‌ర్ణ ప్యాలెస్ లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన విష‌యం విదిత‌మే. ఈ అగ్నిప్రమాద ఘటనపై  ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కి ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఘ‌ట‌న‌పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కేంద్రం నుంచి కూడా అన్ని విధాలా మద్దతు ఉంటుందని సీఎంకు మోడీ భరోసానిచ్చారు. అయితే విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మ‌ర‌ణించిన‌ మృతుల కుటుంబాలకు సీఎం జగన్‌ రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.