మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య

young girl suicide

నిజామాబాద్‌ జిల్లా లింగంపేట మండలం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన పైడాకుల మహేశ్వరి(18)కి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఆగస్టు 9న వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహం కోసం ఆమె తల్లిదండ్రులు బాలయ్య, గంగమణి అప్పులు చేస్తున్నారు. దీంతో తన కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని మనస్తాపానికి గురైన మహేశ్వరి శనివారం గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలించగా ఆదివారం సాయంత్రం మృతి చెందింది. మృతురాలి తల్లి గంగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.