120మందిని రేప్ చేసిన ఆలయపూజారి 

Updated By ManamSat, 07/21/2018 - 12:33
Baba Amarpuri

Baba Amarpuriఫతేహాబాద్ : మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపై అత్యాచారం జరిపి, బెదిరింపులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా పాపం పండింది. అతగాడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే హర్యానా ఫతేహబాద్‌లోని బాబా బాలక్‌నాథ్ ఆలయానికి చెందిన ప్రధాన పూజారి బాబా అమర్‌పురి...ఆలయానికి వచ్చే మహిళలను తమ మాటలతో బోల్తా కొట్టించేవాడు. 

ఆ తర్వాత వారిని లొంగతీసుకుని అత్యాచారం చేస్తూ... వాటిని వీడియోలో చిత్రీకరించేవాడు. అనంతరం ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో పెడతానంటూ మహిళలను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. సుమారు 120మంది మహిళలు దొంగబాబా బారినపడినవారే.

అయితే  మహిళలను లొంగదీసుకున్న వీడియోలు ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలక్‌నాథ్‌ను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 120 వీడియో క్లిప్‌లతో పాటు, పలు అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English Title
Temple priest arrested for allegedly raping 120 women
Related News