ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదు

Updated By ManamFri, 07/13/2018 - 01:06
BANK

BANKబ్యాంకుల ప్రైవేటీకరణ ఇటీవల చర్చనీయాంశమవుతోంది. సమర్ధవంతంగా పనిచేయడం లేదనే సాకుతో ప్రైవేటీకరణ బాట పట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్న వాదనలు వినిపి స్తున్నాయి. బ్యాంకులను జాతీయం చేయడానికి దారితీసిన పరిస్థితులు, వాటి పనితీరును పరిశీలిద్దాం. 1969లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సుమారు 14 బ్యాంకులను జాతీ యం చేసింది. దేశ ఆర్ధిక మూలాలకు జవజీవాలు అందించ డానికి ఈ చర్య తప్పనిసరి అని ప్రభుత్వం వివరణ ఇచ్చిం ది. దానికనుగుణంగానే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పనిచేసి దేశ ఆర్ధిక పరిపుష్టికి బాటలు వేశాయి. దీనితోపాటు 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు.  

ఈ క్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్‌తో పాటు దేశంలో 1,16,394 బ్రాంచిలతో అభివృద్ధి పథంలో కొనసాగుతున్నా యి. ఇందులో 33,864 బ్రాంచ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యాంకులన్నీ 2017- 18లో వ్యవసాయ రంగంపై రూ. 6,22,685 కోట్ల రుణాలు మంజూరు చేశాయని గణాంకాలు సూచిస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు, విద్యా రుణాల కోసం రు.1,30,000 కోట్లు మంజూరు చేశాయి. బడాబాబులకు ఇచ్చిన రుణాల వసూళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం వల్లే ప్రభుత్వ బ్యాంకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి తప్ప పాల కులు, వారి మేధోవర్గం చెప్తున్నట్లు సామాన్యులకు ఇస్తున్న సబ్సిడీ రుణాల వల్లకాదని  గ్రహించాలి. 

ముఖ్యంగా 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావును ప్రధానమంత్రిగా నియమించింది. దేశ ఆర్ధిక పురోగతిని పరుగులు పెట్టిం చాలనే ఉద్దేశంతో ఆయన ప్రపంచీకరణకు తలుపులు బార్లా తెరిచారు. పెట్టుబడులను ఆహ్వానించడం... వాటికి మౌలిక సదుపాయాలు, భారీ ఎత్తున రుణాలు మంజూరు చేయడం వంటి పనులన్నీ చకాచకా జరిగిపోయాయి. అయితే అందు కోసం దేశ ఆర్ధిక మూలాలను బలోపేతం చేస్తున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల భవిష్యత్తుతో పాటు రైతులు మనుగడను కూడా తాకట్టుపెట్టడానికి పాలకులు సిద్ధమవుతున్నారన డానికి ఈ ఐదేళ్లలో రూ. 2,30,000 కోట్లు బ్యాంకుల్లో వసూ లు కాని మొండి బకాయిలను రద్దుచేసిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. 

బ్యాంకుల్లో మొండి బకాయిలు ఎందుకు పెరుగు తు న్నాయి? ప్రపంచీకరణలో భాగంగా ఆతిధ్య కంపెనీలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ముకు కార్పొరేట్ కంపెనీలు కొంత జమచేసి భాగస్వామ్యంలో) పద్ధతిలో కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించేందుకు భారీగా ఇచ్చిన రుణాలు తిరిగి రాకపోవడమే ప్రధాన కారణం.  ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు భాగస్వామ్యాలనేది పేరుకే. కానీ ఎక్కువ మొత్తం భాగస్వామ్యం ప్రభుత్వరంగ బ్యాం కులదే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రుణాలు తీర్చాల్సిన అవసరం తమకు లేదని రుణాలు తీసుకున్న సంస్థలు భావి స్తున్నట్లుగా ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహం పేరుతో ఆయా కంపెనీల అలవిమాలిన గొంతెమ్మ కోర్కెలు తీర్చడా నికి సిద్ధపడుతున్న ప్రభుత్వాల అసమర్ధ విధానాలే ఇందుకు కారణమని మనం గుర్తించాలి. 

తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపిచ్చుకోవడానికి పాలకులు, వారి తొత్తులైన మేధావులు కొత్త పల్లవిని అందు కోవడం గమనార్హం. వీళ్లంతా దేశంలో పేదల సంక్షేమ పథ కాలకు, రైతుల రుణ మాఫీలకు, ఎరువులు, పురుగు మందు లు, విత్తనాలకు, విద్యుత్తుకు ఇస్తున్న సబ్సిడీలే దేశ ఆర్ధిక స్థితిపై పెనుభారం మోపుతోందని చెప్తూ అనుంగు మీడియా ద్వారా ఊదరగొడుతున్నారు. వాస్తవానికి దేశంలో వసూళ్లు కాని మొండి బకాయిలను చిత్తశుద్ధితో సకమ్రంగా రాబడితే పదేళ్లపాటు నిరాటంకంగా సబ్సిడీలను అమలు చేయొచ్చు. మన పాలకుల నిర్వాకానికి పబ్లిక్ సెక్టార్‌లోని బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలని యోచించడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది. పోనీ ప్రైవేటు బ్యాంకుల పని సామర్ధ్యం కూడా పాలకులు ఊహిస్తున్నంత ఘనంగా ఏమీ లేదని గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. 1947 నుంచి 69 వరకు 559 ప్రైవేటు బ్యాంకులు  విఫలమయ్యాయి. బ్యాంక్ ఆఫ్ ద ఇయర్‌గా అవార్డు అందుకున్న గ్లోబల్ ట్రస్ట్‌బ్యాంక్ ఆ మరుసటి ఏడా దే రూ. 1100 కోట్ల నష్టాన్ని చవిచూడగా, 2003లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీ నం చేశారు. బ్యాంకులను జాతీయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి 2014 వరకు 23 ప్రైవేటు బ్యాంకులను పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో విలీనం చేసిన చరిత్రను బ్యాంకు లను ప్రైవేటుపరం చేయాలని సూచిస్తున్న మేధావులు గమనంలోకి తెచ్చుకోగలిగితే మేలు.  

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను దివాలా తీయిం చిన ఘనత కార్పొరేట్ కంపెనీలకే దక్కుతుందంటే అతిశ యోక్తి కాదు. ప్రధానంగా బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో పేరు కుపోయిన నిరర్థక ఆస్తుల విలువ సుమారు రూ. 11 లక్షల కోట్లు కాగా (ఇది మన జాతీయస్థూల ఉత్పత్తిలో 25 శాతం) దీనిలో రూ. 500 కోట్లకు పైబడిన మొత్తం రూ. 9.5 లక్షల కోట్లకు పైబడి ఉంటుందని అంచనా. అనగా సుమారు 80 శాతానికి పైగా మొండిబకాయిలు బ్యాంకులకు గుదిబండగా మారాయని అర్ధమవుతోంది. ఇదంతా ఎవరి పాప ఫలితం? మన పాలకులు అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల కారణం గానే బ్యాంకులు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయని ఆర్ధిక విశ్లేషకులు వివరిస్తున్నారు. పారిశ్రామిక విధానంలో విదేశీ కార్పొరేట్ రంగంపై ఆసక్తి చూపిస్తున్న మన ప్రభువులు దేశంలో ఖాయిలా పడిన పరిశ్రమలను గాలికి వదిలేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను క్రమంగా దివాలా తీయించే పరిస్థితిని సృష్టించి వాటిని ప్రైవేటు పరం చేయ డమో... మూసివేయించడమో చేసిన విధానాన్నే బ్యాంకుల విషయంలోనూ అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది. అదే జరిగితే దేశంలో ఆర్థిక రంగం అతలాకుతలమై సామాన్యులు రోడెక్కే ప్రమాదముంది.  

 ఇప్పటికే దేశంలో వనరుల దోపిడీకి అవకాశం కల్పించి బడా కార్పొరేట్ కంపెనీల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తు న్న మన పాలకులు బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ శక్తుల చేతికి అప్పగిస్తే దేశ భవిష్యత్తుకే ప్రమాదంగా పరిణమిస్తుంది. కేవలం తమ స్వార్థ ప్రయోజ నాల కోసం దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదకర మైన క్రీడకు తెరతీస్తే అది భస్మాసుర హస్తం కాగలదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే ఆర్ధిక మూలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా పాలకుల చేతుల్లో ఉంది. ఎగవేతదారుల నుంచి బకాయిలు జప్తు చేసి బ్యాంకులను ఆర్ధికంగా పరిపుష్టి చేసే మార్గాలు అన్వేషించి,  దేశాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకోకూడదు. ఆర్ధికంగా దివాలా స్థితిలో ఉందని దేశాన్ని తాకట్టు పెట్టే దుస్థితి కల్పించకూడదు. అదే జరిగితే భారత దేశం తిరిగి పరాయి పాలనలోకి వెళ్లడం ఖాయం.
ఇక్బాల్ యం.జి
7396048316 

Tags
English Title
Privatization is not a surgeon
Related News