రబీకి అనుకూల స్థితులు

Updated By ManamMon, 10/15/2018 - 22:13
wheat

wheatన్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ఉపసంహరణలో జాప్యం గోధుమలు, ఆవాలు వంటి శీతాకల (రబీ) పంటలకు మేలు చేస్తుందని, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తనాలు వేయడం మొదలైందని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్.కె. మల్హోత్రా తెలిపారు. రబీ పంటలు (గోధుమలు, బార్లీ, ఆవాలు, పొద్దుతిరుగుడు పువ్వు, కొన్ని కాయధాన్యాలు, సరసు గింజలు) వేయడం సాధారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంట చేతి కందడం మార్చి నుం చి మొదలవుతుంది. ‘‘పం టల దిగుబడులు నేలలో తేమ, మొక్క వృద్ధికి  పుష్టినిచ్చేందుకు అది ఎంతవరకు అందుబాటు లో ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు వెనుకపటు ్టపట్టడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో రబీ పనులు మొదలుపెట్టేందుకు భూమిలో తగినంత తేమ ఉంది’’ అని మల్హోత్రా అన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబర్ 1 నుంచే వెనుకపట్టుపడతాయి. ఈ ఏడాది జాప్యమైంది. భూమి పరిస్థితులు అందుబాటులో ఉండడంతో రాజస్థాన్‌లో రైతులు ఇప్పటికే ఆవాలు వేయడం ప్రారంభించారు. ఇతర రబీ పంటలు వేయడం రానున్న వారాల్లో మొదలవుతుందని ఆయన అన్నారు. ఈఏడాది ఆవాల పంట విస్తీర్ణం పెరుగుతుందన్నారు. గత ఏడాది రుతుపవనాల ఉపసంహరణ వర్షాలు లేకపోవడం వల్ల ఆవ పంట విస్తీర్ణంలో 4 లక్షల హెకార్లు తగ్గాయి. రబీ పంటలను 70-72 మిలియన్ హెక్టార్లలో వేస్తున్నారు. గోధుమ పంట వేసేందుకు రైతులు పొలాలు దున్నుతున్నారని మల్హోత్రా చెప్పారు. ఈ ఏడాది గోధుమ పంటలో 100 మిలియన్ టన్నుల దిగుబడి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. గోధుమ దిగుబడి 2017-18లో 99.7 మిలియన్ టన్నులుగా ఉంది. 

Tags
English Title
Positive positions for Rabbi
Related News