లలిత&కో అధినేత మార్టూరి రామారావు కన్నుమూత

Updated By ManamTue, 10/16/2018 - 12:59
Breaking

Breakingఏలూరు: ఆర్‌ఎస్ఎస్ సీనియర్ నేత, ప్రముఖ ప్రిటింగ్ సంస్థ లలిత&కో అధినేత మార్టూరి రామారావు కన్నుమూశారు. తెల్లవారుజామున నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. దగ్గరి బంధువు అనారోగ్యంతో ఉండటంతో మార్టూరి రామారావు ఇటీవల ఏలూరుకు వెళ్లారు. అక్కడే ఆయన పరమదించారు.

ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకువస్తామని, బుధవారం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నామని రామారావు కుమారుడు సత్యప్రకాశ్ తెలిపారు. కాగా లలిత& కో కంపెనీ ద్వారా రెండు తెలుగురాష్ట్రాలకు రామారావు పరిచయస్తులు. వ్యాపారం నిర్వహిస్తూనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఆనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

English Title
Lalitha& Co founder Martoori Ramarao passed away
Related News