కోహ్లీ, శాస్త్రీలకు ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం

Virhat Kohli

సిడ్నీ: ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సృష్టించిన టీమిండియాక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌తో (ఎస్‌సీజీ) ప్రత్యేక అనుబంధం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య శనివారమిక్కడ తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రికి ఎస్‌సీజీ గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని ఇచ్చింది. దీంతో ఈ బంధం మరింత దృఢంగా మారింది. ఈ వేదికలో టీమిండియా కెప్టెన్‌కు, కోచ్‌కు తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కోచ్ రవిశాస్త్రి 1992లో డబుల్ సెంచరీ చేసింది ఇక్కడే. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. ఇంతకుముందు టీమిండియా ఇక్కడికి వచ్చినప్పుడు కెప్టెన్ కోహ్లీ సెంచరీ సాధించాడు. నిర్ణీత ఓవర్ల ఫార్మాట్‌లోనూ రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ఆసక్తికరమైన అంశమేంటంటే.. కోహ్లీ ఈ మైదానంలో నాలుగు వన్డేలు ఆడాడు. అతని అత్యధికం 21. అయితే ఈసారి ఆ అత్యధిక స్కోరు మార్చాలని కోహ్లీ భావిస్తున్నాడు.

సంబంధిత వార్తలు