వినూత్న కథాంశంతో..

Updated By ManamSun, 07/22/2018 - 00:03
image

imageఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్(పెదబాబు) నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ఏ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. అర్జున్‌రెడ్డి, నేహాదేశ్ పాండే హీరోహీరోయిన్స్‌గా నటించారు. శ్రీవెంకట్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియోను హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ప్రముఖ నటుడు బాబూమోహన్ ఈ చిత్రం ఆడియోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ ‘‘ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ అన్నీ తానే అయి.. డైరెక్టర్ కె.ఎస్.నాగేశ్వరావు నుంచి చాలా మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. భవిష్యత్‌లో చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీవెంకట్ మ్యూజిక్ చాలా బావుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ మంచి హిట్ అవుతుంది’ అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చిన నిర్మాత బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘‘బిచ్చగాడి మజాకా’ రొటీన్ స్టోరీ కాదు.. బిచ్చగాళ్ళు లేని సొసైటీ కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఏవిధమైన మలుపులు తిరిగింది. అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు. దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరావు మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాగా త్వరలో విడుదల కానున్న ‘బిచ్చగాడా మజాకా’ విడుదలయ్యాక చాలా పెద్ద సినిమా అవుతుంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 

English Title
Innovative storyline
Related News