శభాష్ హిమ.. రన్నింగ్‌లో చరిత్ర

Updated By ManamFri, 07/13/2018 - 10:56
hima

hima das న్యూఢిల్లీ: ఇండియన్ స్పింటర్ హిమా దాస్ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్‌లాండ్ టాంపెర్‌లో జరిగిన ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్  ఛాంపియన్‌షిప్స్‌లో 400మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన హిమా దాస్.. ఈ పతకం సాధించిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా కూడా ఆమె ఘనతను సాధించింది.

అస్సాంకు చెందిన 18సంవత్సరాల వయసున్న హిమ 51.46 సెకన్లలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక రొమేనియాకు చెందిన ఆండ్రియా మిక్‌లోస్ రెండో స్థానంలో నిలవగా.. అమెరికాకు చెందిన టేలర్ మన్‌సన్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ 51.32 టైమింగ్‌తో హిమ ఆరోస్థానంలో నిలిచింది. 

మరోవైపు హిమా దాస్ విజయంపై పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ హిమ అంటూ సోషల్ మీడియాలో తమ అభినందనలు తెలిపారు. వారిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, బబితా పొగత్, సునీల్ చెత్రి, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అక్తర్, తాప్సీ తదితరులు ఉన్నారు.

 

English Title
 Hima Das scripts history, wins gold
Related News