వీడియో: లేచిన వేళ బాగుంది.. భూమి మీద నూకలున్నాయి..!

Updated By ManamWed, 05/30/2018 - 21:05
Lucky escape, scooter rider, accident with bus

Lucky escape, scooter rider, accident with bus విట్లా (కర్ణాటక): లేచిన వేళ బాగున్నట్టుంది. రోడ్డుపై అతివేగంతో స్కూటర్ మీద రయ్ రయ్‌మంటూ దూసుకొచ్చిన ఓ యువకుడికి రెప్పపాటులో ప్రమాదం తప్పింది. దాదాపు మృత్యువు అంచుల్లోకి వెళ్లి యమధర్మరాజుకు హాయ్ చెప్పివచ్చాడు. సరిగ్గా అదే రోడ్డుపై ఎదురుగా వస్తున్న బస్సు కిందపడబోయి అదృష్టవశాత్తూ త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో భయటపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని విట్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు టర్నింగ్ వద్ద స్కూటర్ మీద రయ్‌మంటూ దూసుకొచ్చిన యువకుడి స్కూటర్ సడన్‌గా స్లిప్ అయింది. అదే సమయంలో పక్కనే మరో వాహనం కూడా వెళ్తోంది. అంతలో ఎదురుగా వేగంగా బస్సు దూసుకొస్తోంది. రెండు వాహనాల మధ్య యువకుడు స్కూటర్ మీద నుంచి జారిపడ్డాడు.

బస్సు స్కూటర్‌పై నుంచి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి బస్సును నిలిపివేశాడు. దాంతో బస్సులోని ప్రయాణికులు దిగి చూడగా యువకుడు నిక్షేపంగా ప్రాణాలతో నిలబడి ఉన్నాడు. అతడి స్కూటర్ మాత్రం బస్సు కింద పడి నుజ్జునుజ్జుయింది. షాక్‌ నుంచి తేరుకున్న ఆ యువకుడు ఏమితెలియనట్టు అలాగే నిలబడి చూస్తున్నాడు. ప్రాణాలతో బయటపడిన అతన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోవడం వంతైంది. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..

English Title
Footage: Lucky escape for scooter rider in accident with bus
Related News