తాగుబోతు ఫిట్‌నెస్ చాలెంజ్.. ఇక కాస్కోండి..!

Updated By ManamMon, 06/04/2018 - 12:18
Drunk man, push-ups, in the rain fitness high

Drunk man, push-ups, in the rain fitness high కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ పిలుపునిచ్చిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దిగ్గజ క్రీడాకారుల నుంచి సినీ తారల వరకు ప్రతిఒక్కరూ తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ.. సన్నిహితులకు సవాల్‌ విసురుతున్నారు. తాజాగా ఓ తాగుబోతు కూడా రాథోడ్‌కు ఫిట్‌నెస్ చాలెంజ్ విసిరినట్టున్నాడు. జిమ్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఒకవైపు జోరువాన కురుస్తుండగా నడిరోడ్డుపై నిలబడి పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. తాగిన మైకంలో అటుఇటూ తూలుతూ రాథోడ్‌ విసిరిన సవాల్‌కు నేను సిద్ధం అంటూ ఎక్సర్‌సైజులు చేశాడు. రోడ్డుపై నిలబడి వరుణిడికి దండాలు పెడుతూ పారుతున్న వర్షపునీటిని తాగేసి తోడ కొట్టి మీసం తిప్పుతూ హల్‌చల్ చేశాడు.

ఏదిఏమైనా మద్యం తాగితే అరోగ్యానికి హానికరమని అందరికి తెలుసు.. మద్యం తాగి కూడా కసరత్తులు చేస్తే మరింతగా ఫిట్‌గా ఉండొచ్చునని మందుబాబు ఇలా చేసి చూపించాడనుకుంట. తాగుబోతు జోరువానలో నడిరోడ్డుపై పుష్ అప్స్ చేస్తుండగా అక్కడి యువకులు కొందరూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. తాగుబోతు ఫిట్‌నెస్ సవాల్‌ను కాస్కోండి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

English Title
Drunk man doing push-ups in the rain is sure to give you a fitness high
Related News